ASF: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా బోరిలాల్ గూడ గ్రామపంచాయతీలో నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ చవాన్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ
గ్రామంలో చేయూత పింఛను పత్రాలు పంపిణీ


