MHBD: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ తల్లి దేవాలయంలో కొబ్బరికాయల టెండర్ వేలం పాట ఉత్కంఠగా సాగింది. వేలంపాటలో రూ.11 లక్షల 24వేలకు జనగాం రమేష్ టెండర్‌ను దక్కించుకున్నారు. దీంతో వరుసగా రెండోసారి కొబ్బరికాయల టెండర్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో వెల్లడించారు. ఈ నెలలో నాలుగుసార్లు వాయిదా పడిన టెండర్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది.
తెలంగాణ
రూ.11 లక్షల పైగా పలికిన ముసలమ్మ ఆలయ టెండర్


