హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగంచిప్రోలులో నామినేషన్ కేంద్రాలు ఇలా..!

NTR: పెనుగంచిప్రోలు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, ముండ్లపాడు, నవాబుపేట, శనగపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చ అన్నారు. ఈ నెల 29న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరుగుతుందన్నారు.