NDL: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు 48.57 టీఎంసీలకు పడిపోయాయి. పూర్తి స్థాయి 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 829.10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో తొమ్మిది రోజుల్లో 3.03 టీఎంసీల నీరు తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలు


