హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లాపూర్‌లో రూ.2.23 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

RR: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆరు కాలనీల్లో రూ.2.23 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బ్రహ్మపురి, సూర్యనగర్, మల్లికార్జున్ నగర్, శక్తిసాయి నగర్, దత్తాత్రేయ నగర్, గోకుల్ నగర్ కాలనీల్లో సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్ పనులు చేపట్టనున్నారు.