హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టుమిషన్ ఉచిత శిక్షణ

MLG: ఏటూరునాగారం సబ్‌డివిజన్ మహిళలకు డిసెంబర్ 1 నుంచి 31 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తెలిపారు. 19-49 ఏళ్ల వయస్సు, పదో తరగతి అర్హత కలిగిన మహిళలు నవంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.