BPT: రామకృష్ణాపురం పంచాయతీ భారత్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలో డిసెంబర్ 4 నుంచి 7 వరకు 252 కుండల దేశ శౌర్య సమృద్ధి గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వ కళ్యాణం, పర్యావరణ కాలుష్య నివారణ కోసం 33 రకాల వనమూలికలు, స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యితో హోమం నిర్వహిస్తున్నామని, దీంతో ఆక్సిజన్ విడుదలవుతుందన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామకృష్ణాపురంలో దేశ శౌర్య సమృద్ధి గాయత్రి మహాయజ్ఞం


