హైదరాబాద్: 28°C
తెలంగాణ

లండన్‌ బ్రూనెల్‌ లా సొసైటీ ప్రతినిధిగా చందన తక్కూరి

NRML: లండన్‌లోని బ్రూనెల్‌ యూనివర్సిటీకి చెందిన బ్రూనెల్‌ లా సొసైటీలో LLM విద్యార్థుల ప్రతినిధిగా నిర్మల్‌కు చెందిన చందన తక్కూరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన విద్యార్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేలా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానన్నారు.