హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేబర్ కోడ్ల రద్దుకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి

SRCL: సిరిసిల్లలో సీఐటీయూ నాయకుడు కోడం రమణ మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు. సమ్మె, సంఘాల ఏర్పాటు, కనీస వేతనాల కోసం పోరాడే హక్కులు దెబ్బతింటాయని పేర్కొన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడికి కార్మికులు రావాలన్నారు.