హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే!

భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై గ్రాంట్ థార్న్టన్ భారత్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో చాలామంది ఉద్యోగులు తమ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని భావిస్తున్నా, అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా, ఆదాయం నిలిచిపోయినా ఏడాది పాటు కుటుంబ ఖర్చులు భరించే స్థాయిలో పొదుపులు లేవని తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 83% మందికి ఏడాది పాటు ఆదాయం లేకపోయినా జీవించేందుకు పొదుపు లేదని వెల్లడైంది.