హైదరాబాద్: 28°C
వార్తలు

అలా టోల్ దాటితే మొబైల్‌కు అలర్ట్

జాతీయ రహదారులపై బీమా లేకుండా ప్రయాణించే వాహనదారులకు ఇకపై మొబైల్‌కు SMS అలర్ట్ రానుంది. ఈ విధానాన్ని ఢిల్లీలోని ఓ టోల్‌ప్లాజా వద్ద NHAI ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం బీమా లేకుండా పట్టుబడితే బేస్ ప్రీమియానికి మూడు రెట్లు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు.