TG: హైదరాబాద్‌లో ఈనెల 19న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. హైటెక్స్ కాకతీయ హాల్లో నిర్వహించే సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి గడ్కరీ హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రహదారుల అభివృద్ధి, ప్రమాదాల నివారణపై చర్చించనున్నారు.
వార్తలు
ఎల్లుండి జరగనున్న ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు


