హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజేపీ గురుకులాన్ని సందర్శించిన మహిళ కమిషన్

MHBD: గూడూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సంక్షేమ పాఠశాలను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నూనావత్ రాధ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.