హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్క్రూటినీ షురూ.. అభ్యర్థుల్లో టెన్షన్

NLR: రాష్ట్రంలోని 23 పట్టణ (4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు) ఎన్నికలకు సంబంధించి నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. స్క్రూటినీలో తమ నామినేషన్లు ఆమోదం పొందుతాయా? తిరస్కరణకు గురవుతాయా? అన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.