హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సరఫరాపై అప్రమత్తమైన అదికారులు

KMM: ఎల్‌నినో ప్రభావంతో డిసెంబర్ 15 నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో బైరాపురంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎస్సీ వాడ నుంచి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి 3, 4 వార్డుల్లో ఆరు నీటి కుళాయిలు నిర్మించినట్లు సర్పంచి సుధారాణి తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచి అజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.