హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించండి: సీఐ

W.G: గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజల సహకరించాలని ఆకివీడు రూరల్ సీఐ కాళీ చరణ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మండలంలోని కుప్పనపూడి గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కక్షలకు పోయి కేసుల్లో ఇరుక్కోవద్దని తద్వారా భవిష్యత్తు పాడవుతుందని సూచించారు. ఈ గ్రామాల్లో ఎస్సై శుభశేకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.