VKB: తాండూర్ పట్టణంలోని హిమాలయ హోటల్‌లో మంగళవారం TUWJ H-143 తాండూర్ నియోజకవర్గ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు రవీందర్.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
'జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి'


