AKP: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మాకవరపాలెం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కుర్చీల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి వి. చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌతమి లలిత కళాశిక్షణా కేంద్ర ప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు వివిధ రకాల పోటీలు


