MBNR: మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌పై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని BRS అధికార ప్రతినిధి కట్ట రవి కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా విమర్శలకే పరిమితమవుతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ
ఆరోపణలు నిరూపించే దమ్ముందా?: కట్ట రవి కిషన్ రెడ్డి


