హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ ప్రదర్శించిన MPDO

VZM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వంగర మండలంలోని 29 పంచాయతీలకు రెండవ విడత ఎన్నికల షెడ్యూల్‌ను MPDO రాజారావు మంగళవారం ప్రదర్శించారు. ఈ మేరకు మండలంలో 35,670 మంది ఓటర్లు ఉండగా, 256 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేపటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ,21న పరిశీలన, 24న ఉపసంహరణ, 29న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.