హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముందస్తు రక్షణ చర్యలకు మంత్రి ఆదేశం!

బాపట్ల: 'అక్వాన్' తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో ముందే పరికరాలు సిద్ధం చేసి, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తెగిపడిన తీగలతో ప్రాణనష్టం జరగకుండా చూడాలని, కరెంట్ కోతలపై వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.