హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRGTA జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సిద్దిపేట జిల్లా PRGTA నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జాలిగామ నవీన్, ప్రధాన కార్యదర్శిగా జి. రఘురామ్ రెడ్డి ఎన్నికయ్యారు. గురుకుల ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణే సంఘం లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం రమేశ్ గౌడ్ తెలిపారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం తగ్గించాలని, 010 పద్దు ద్వారా వేతనాలు, హెల్త్ కార్డులు కల్పించాలని కోరారు.