హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

బాపట్ల: చీరాల టీడీపీ కార్యాలయంలో వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామస్తులు టీడీపీలో చేరారు. పులి కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో 200 కుటుంబాలు పార్టీలో చేరగా, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అందరిని కలుపుకుని వెళ్తామని తెలిపారు.