హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమ వాసులను కలవరపెడుతున్న ONGC లీక్

కోనసీమ జిల్లా ప్రజలను ONGC గ్యాస్ లీక్ ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా నగరం గ్రామం సమీపంలోని గ్యాస్ బావి వద్ద చోటుచేసుకున్న లీకేజీతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గ్యాస్ తవ్వకాల మధ్య తమ ప్రాణాలకు భద్రత ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.