హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపీఎస్ కోసం ఉద్యోగుల ధర్మదీక్ష

KNR: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ పునరుద్ధరించాలని మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు ధర్మదీక్ష చేపట్టారు. టీఎస్సీపీఎస్ఈయూ పిలుపుతో సెలవు పెట్టి నిరసనకు దిగారు. యూపీఎస్‌ను తిరస్కరిస్తున్నామని, ఓపీఎస్ సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీక్ష మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.