సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో బాగా ఆకలి వేస్తుంది. అప్పుడు చాలామంది సమోసా, బజ్జీలు, జంక్ ఫుడ్ తింటుంటారు. దీనివల్ల బరువు పెరగడంతో పాటు ఎసిడిటీ సమస్యలు వస్తాయి. వీటికి బదులుగా నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, ఉడికించిన శనగలు, పల్లీలు, ఫ్రూట్ సలాడ్ వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి ప్రొటీన్లు, ఫైబర్‌ను అందించి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి.
ఆరోగ్యం
సాయంత్రం వేళ స్నాక్స్ తింటున్నారా?


