హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో ఘనంగా గోపాష్టమి వేడుకలు

SRD: సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో గోపాష్టమి వేడుకలు మంగళవారం నిర్వహించారు. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. గోపాష్టమి ప్రాముఖ్యం గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.