హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోండా మార్కెట్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రోజూ వేల సంఖ్యలో వచ్చే వినియోగదారులు, వ్యాపారులకు భద్రత పెరుగుతుందని, ఘటనలు జరిగితే నిందితులను గుర్తించడానికి పోలీసులకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మార్కెట్ కమిటీని అభినందించి, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.