MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలో నూతనంగా పెన్షన్లు మంజూరైన 269 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పెన్షన్లు వారికి ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన: MLA


