హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహణ

NLR: కొడవలూరు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కవి సమ్మేళనం, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. కవిసమ్మేళనంలో కవులు తమ కవితల ద్వారా సమాజానికి మంచి సందేశాలను అందించారు. అనంతరం చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మకతను, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.