ELR: లింగపాలెం సమీపంలోని పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూణే నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించి సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులు, కూలీలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పొలాలకు వెళ్లరాదని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలోని పుకార్లను నమ్మొద్దని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దపులి సంచారంపై అధికారులు అప్రమత్తం


