హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

AKP: రావికమతం మండలం కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పీవీఎస్ఎన్.రాజు సతీమణి సునీత మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నివాసం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నిర్వహించిన రోడ్‌షోలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తనకు సర్పంచ్‌గా అవకాశం ఇవ్వాలని సునీత కోరారు.