హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం: కలెక్టర్

SRD: ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూరు, మంజీరా డ్యామ్లలో నీటిమట్టం తగ్గినందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్‌నినోపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు తక్కువ నీటితో పండే పంటలను పండించాలన్నారు.