హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DEC 5న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన?

CTR: డిసెంబర్ 5న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రానున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పటిలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ, పార్టీ పరిస్థితులపై సమీక్షించడంతో పాటు అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లను బుజ్జగించేందుకు ఆయన పర్యటన సాగనున్నట్లు సమాచారం. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.