హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KNR: వీణవంకమండలంలోని లస్మక్కపల్లిలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, ఐకేపీ సీసీ ఆనంద్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.