హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుఫాన్ ప్రభావంతో వరి దిగుబడి భారీగా తగ్గుదల

KKD: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోట మండలంలో వరి దిగుబడి గణనీయంగా తగ్గినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ విటి రామారావు తెలిపారు. వల్లూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన పంట దిగుబడి ప్రయోగాల్లో ఎకరాకు సగటున 23 బస్తాల (75 కిలోలు) దిగుబడి మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. సాధారణంగా ఎకరాకు 38 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని తెలిపారు.