హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ

పల్నాడు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్లు, 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.