హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లోకి 100 మంది యువకులు చేరిక

SRPT: పట్టణంలోని విద్యానగర్‌లో పీఎస్ఆర్ సెంటర్, 21వ వార్డు కొత్తగూడెం బజార్‌కు చెందిన చెరుకు మురళి (చంటి) ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.