నంద్యాల: బనగానపల్లె పట్టణంలో చేపడుతున్న ముఖద్వారాల ఆధునికీకరణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఆధునిక హంగులతో పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులను ఆకర్షణీయంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి


