హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తున్నారు?

మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యకరమైన, పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే యాక్టివ్‌గా ఉండవచ్చు. పీచు పదార్థాలు ఉండే చపాతీలు, పుల్కాలను ఇష్టమైన కూరలతో తీసుకోవచ్చు. పాలకూర వంటి ఆకుకూరలు, ఉల్లిపాయలు, టమోటాల సలాడ్ తీసుకోవడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అంది శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. భోజనంలో పెరుగు, రైతా చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది. ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, అన్నం/రోటీ మంచి కాంబినేషన్.