హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆముదం ఆకుల్లో ఔషధ గుణాలు

వయసు పైబడటం వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వాపులను తగ్గించడంలో ఆముదం ఆకులు బాగా పనిచేస్తాయి. ఒక కడాయిలో 20 మి.లీ. ఆవనూనెను వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ఆముదం ఆకును అందులో ముంచి నొప్పి ఉన్న మోకాళ్లపై ఉంచి, తెల్లటి వస్త్రంతో కట్టు కట్టాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. శరీరంపై అయ్యే చిన్న గాయాల నుంచి పెద్ద గాయాల వరకు నయం చేయడానికి ఆముదం ఆకులను ఉపయోగించవచ్చు.