హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి!

SRPT: నూతనకల్ మండలం తాళ్లసింగారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొడిశెట్టి వెంకటయ్య (56) వృత్తిరీత్యా గీత కార్మికుడు. రోజువారీ పనిలో భాగంగా సోమవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన ఆయనను రైతులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.