హైదరాబాద్: 28°C
తెలంగాణ

NH-63 భూసేకరణపై రైతుల ఆందోళన

MNCL: నిజామాబాద్ జిల్లా నర్పూర్-జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు 148.6 కిలోమీటర్ల NH-63 నాలుగు వరసల విస్తరణకు భూసేకరణ జరుగుతోంది. లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో గ్రామసభ లేకుండానే పరిహారం ఖరారు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు, బోర్లు, చెట్లకు వేర్వేరుగా విలువ కట్టాలని కోరుతున్నారు. గుడిపేటలో రెండెకరాల్లో 142 ఆయిల్‌పామ్ మొక్కలు వేసిన రైతు రమేష్ నష్టపోనున్నారు.