హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిష్టంపేట మానేరు వంతెన ఎప్పుడు?

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట వద్ద మానేరుపై వంతెన నిర్మాణం ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం నదిపై వేసిన తాత్కాలిక మట్టి రోడ్డే ఆధారం కాగా, వరదలొస్తే కొట్టుకుపోతోంది. వంతెన పూర్తయితే భూపాలపల్లి, పరకాల వైపు దూరం సుమారు 30 కిలోమీటర్లు తగ్గుతుంది. కేంద్రం రూ.77 కోట్లు కేటాయించిందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 40 ఏళ్లుగా వినతులు ఇస్తున్నా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.