పెద్దగా పట్టించుకోం కానీ చిలగడ దుంప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ A, C, పొటాషియంతో కూడిన చిలగడ దుంప పేగులు, గుండె, కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణకోశ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. కంటి శుక్లాలు, కళ్లు పొడిబారే ముప్పు తగ్గిస్తుంది. గుండె, రక్తనాళాల మీద ఒత్తిడి తగ్గి గుండె జబ్బు ముప్పు తగ్గేలా చేస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అరికడుతుంది.
ఆరోగ్యం
ఆరోగ్యానికి మేలు చేసే 'చిలగడ దుంప'


