హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోయెగావ్ వద్ద పోలీసుల ప్రత్యేక తనిఖీలు

ASF: వాంకిడి మండలం గోయెగావ్ గ్రామం వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. SP నీతికా పంత్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక స్క్వాడ్ బృందం బస్సులు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సహకారం తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు SI మహేందర్ తెలిపారు.