హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న విద్యాశ్రీష స్వామీజీ

సత్యసాయి: లేపాక్షి శ్రీ దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని నవంబర్ 17న సోసలె వ్యాసరాయ మఠానికి చెందిన విద్యాశ్రీష స్వామీజీ దర్శించుకున్నారు. అమ్మవారు, వీరభద్రస్వామికి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు శీను స్వామి, సింహ స్వామి, కమిటీ ఛైర్మన్ పరిగి వేణుగోపాలరావు స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చరిత్ర, విశేషాలను వివరిస్తూ ఆలయం అంతా చూపించారు.