హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వేంసూర్ లో మంత్రి పొంగులేటి పర్యటన

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం వేంసూరు లో పర్యటించనున్నట్లు ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 11 గంటలకు జడ్పీ హైస్కూల్ ఆవరణంలో చేయూత పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారని వారు తెలిపారు. కావున మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.