హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పిడమర్తి రవికి MLC అవకాశం కల్పించాలి'

HNK: తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత పిడమర్తి రవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని BSF ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం విద్యార్థి దశ నుంచే పోరాడిన రవికి అవకాశం కల్పించి విద్యార్థి లోకానికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు.