హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాకవరం సర్పంచ్‌గా కూటమి అభ్యర్థి నామినేషన్

ASR: కొయ్యూరు మండలం ఎం.మాకవరం పంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి తరపున టీడీపీ పార్టీకి చెందిన సుర్ల ఆనంద్ కుమార్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికారికంగా నామినేషన్ సమర్పించారు. టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొర్రు రామ్మూర్తి, టీడీపీ నేత శ్రీను తదితరులు పాల్గొన్నారు.